డోన్ లో ఈ నెల 20న స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం ; మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ గౌడ్
Dhone, Nandyal | Sep 17, 2025 ప్రభుత్వం ప్రతీనెల మూడో శనివారం నిర్వహించనున్న స్వచ్ఛాంధ్ర— స్వచ్ఛ దివస్ కార్యక్రమం డోన్‌లో నిర్వహించనున్నామని మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ గౌడ్ తెలిపారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 20న ఉదయం 9 గంటలకు గాంధీ సర్కిల్ వద్ద ఈ కార్యక్రమం ప్రారంభం కానుందని పేర్కొన్నారు. ప్రజలలో పరిశుభ్రతపై అవగాహన పెంపొందించేందుకు "GREEN A.P." కార్యక్రమాన్ని, ప్రతిజ్ఞ వంటి కార్యకలాపాలు చేపట్టామని కమిషనర్ తెలిపారు.