దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని జమ్మిగడ్డ స్మశాన వాటికలో ప్రత్యేకంగా పండుగ జరుపుకున్నారు. ప్రతి ఏడాది విధంగా ఈసారి కూడా స్థానికులు పూర్వికుల సమాధుల వద్ద దీపాలు వెలిగించి వారిని స్మరించుకున్నారు. ఆధ్యాత్మిక వాతావరణం లో జరిగిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని పూర్వీకుల ఆత్మలకు శాంతి కలగాలని ప్రార్థించారు.