కర్నూలు: జనవరి 4న జరిగే చలో విశాఖ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి: పోస్టర్లను విడుదల చేసిన కర్నూలు సిఐటియు నాయకులు
ఈనెల 31 నుంచి జనవరి 4వ తేదీ వరకు విశాఖపట్నంలో సిఐటియు అఖిలభారత మహాసభలు అలాగే జనవరి 4న ఆర్కే బీచ్ లో జరిగే భారీ బహిరంగ సభను జయప్రదం చేయాలని కార్మికులకు పిలుపునిస్తూ చలో విశాఖపట్నం పోస్టర్లను మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు సిఐటియు కర్నూలు జిల్లా నాయకులు కార్మిక కర్షక భవన్ సిఐటియు కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పిఎస్ రాధాకృష్ణ యండి అంజి బాబు గారు మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రం విడిపోయాక జరుగుతున్న మొట్టమొదటి సిఐటియు ఆల్ ఇండియా మహాసభలు విశాఖపట్నంలో జరగడం కార్మిక వర్గానికి గర్వకారణం అని తెలిపారు.