కూకట్పల్లి నల్లచెరువు పరిసరాలను హైడ్రా అభివృద్ధి చేస్తోంది. ఈ అభివృద్ధి పనులను హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్ ఎక్కడ అంతరాయం లేకుండా చూడాలని సూచించారు. సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసి భద్రతను పటిష్టం చేయాలన్నారు. చెరువు చుట్టూ మెడిసినల్ ప్లాంట్స్ నాటాలని తెలిపారు.