నల్లచెరువులోని దేవరింటిపల్లి సమీపంలో రైలు కింద పడి మహిళ మృతి
శ్రీ సత్య సాయి జిల్లా కదిరి నియోజకవర్గం నల్లచెరువు మండల పరిధిలోని దేవరింటిపల్లి సమీపంలో ఆదివారం మధ్యాహ్నం రైలు పట్టాలపై ఒక మహిళ మృతి చెందిన ఘటన వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం కదిరి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతురాలి వివరాల కోసం దర్యాప్తు చేపట్టారు.