కనిగిరి శాసనసభ్యులు , ఒంగోలు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి శనివారం ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ రాజాబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కనిగిరి నియోజకవర్గంలోని పలు పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ రాజాబాబుకు ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన కలెక్టర్ రాజాబాబు... కనిగిరి నియోజకవర్గంలో పెండింగ్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.