సిర్పూర్ టి: సిర్పూర్ నియోజకవర్గం లోని పలు మండలాలలో యూరియా కోసం పడిగాపులు కాస్తున్న రైతులు
సిర్పూర్ నియోజకవర్గంలోని మండలాలలో యూరియా కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. వేకువజామున యూరియా పంపిణీ కేంద్రాల వద్దకు వచ్చిన తమకు ఒక్క యూరియా బస్తా కూడా అందడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి తమకు కావలసిన యూరియాను పంపిణీ చేయాలని రైతులు కోరుతున్నారు,