మాచర్ల పరిధిలో నాగార్జునసాగర్ ప్రాజెక్టు గేట్లు మూసివేత
శ్రీశైలం నుంచి వరద ప్రవాహం తగ్గడంతో పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం మాచర్ల మండలం నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు సంబంధించి సోమవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో అధికారులు క్రస్ట్ గేట్లు మూసివేశారు. ఈ సందర్భంగా సాగర్ ట్రస్ట్ గేట్లు మూసి వేయడంతో పర్యాటకులు నిరాశకు గురయ్యారు. పెద్ద సంఖ్యలో చేరుకున్న సందర్శకులు వెనుతిరిగి పోయారు ప్రస్తుతం సాగర్ జలాశయంలో నీటిమట్టం 587 అడుగులుగా ఉంది ప్రవాహం పెరిగిన తర్వాతే గేట్లు తెరవన్నట్లు అధికారులు వెల్లడించారు.