చిలకలూరిపేటలో ఆటో,ద్విచక్ర వాహనం ఢీకొనడంతో వ్యక్తికి తీవ్ర గాయాలు
పల్నాడు జిల్లా చిలకలూరిపేట పట్టణంలో మంగళవారం పాత పశువుల సంత వద్ద ద్విచక్ర వాహనం మీద నరసరావుపేట వైపు వెళ్తున్న వ్యక్తిని వెనుక నుండి ఆటో ఢీ కొట్టడంతో ద్విచక్ర వాహనంపై ఉన్న వ్యక్తికి బలమైన గాయాలు అవటంతో స్థానికులు 108 ద్వారా హుటాహుటిన గాయాలైన వ్యక్తిని, ఆటో డ్రైవర్ని చిలకలూరిపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ద్విచక్ర వాహనంపై గాయాలైన వ్యక్తి లింగంగుంట్ల గ్రామానికి సంబంధించిన వ్యక్తి గుర్తించారు.