నంద్యాల పట్టణంలో సోమవారం దారుణం చోటు చేసుకుంది.వినోద్ అనే యువకుడు పెద్ద చర్చి సెంటర్లో అనుమానాస్పదంగా మృతిచెందారు. వినోదును కిరణ్ అనే వ్యక్తి హత్య చేశారని బంధువులు ఆరోపిస్తున్నారు. చర్చి సెంటర్లో వినోద్ బైక్ను ఢీకొట్టిన విషయంలో వివాదం చెరరేగిందని కిరణ్ మరికొందరు వ్యక్తులు వినోద్ పై దాడి చేయడంతో మృతి చెందాడని కుటుంబ సభ్యులు తెలిపారు.పోలీసులు న్యాయం చేయడం లేదంటూ బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు వినోదు మృతి పై విచారణ జరిపి పోలీసులు న్యాయం చేయాలని మృతుని కుటుంబ సభ్యులు బంధువులు డిమాండ్ చేస్తున్నారు