పులివెందుల: అంకాలమ్మ గూడూరు విద్యార్థులు రాష్ట్రస్థాయి క్రీడాపోటీలకు ఎంపిక
సింహాద్రిపురం మండలం అంకాలమ్మగూడూరు జిల్లాపరిషత్ హైస్కూలుకు చెందిన ఇద్దరు విద్యార్థులు జిల్లా స్థాయి క్రీడాపోటీలలో పాల్గొని తమ ప్రతిభాపాటవాలతో రాష్ట్రస్థాయికీ ఎంపికైనట్లు గూడూరు జడ్పీ హైస్కూల్ హెడ్మాస్టర్ అరుణ తెలిపారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఉమ్మడి కడప జిల్లాస్థాయిలో అక్టోబర్ 31న, రాయచోటి మాసాపేట జిల్లాపరిషత్ హైస్కూలు క్రీడామైదానంలో 300 మంది విద్యార్థులు పాల్గొన్న ఈ జిల్లాస్థాయి పోటీలలో బేస్ బాల్ పోటీలలో అండర్ 14 విభాగంలో భానుకుమార్, సాఫ్ట్ బాల్ పోటీలలో అండర్ 17 విభాగంలో అరవిందనాథరెడ్డి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు.