రాయచోటిని జిల్లా కేంద్రం చేయడంలో ఏ ప్రాంతానికీ అన్యాయం చేయాలన్న ఉద్దేశ్యం లేదు: రాయచోటి మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డీ
రాయచోటిని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేసిన విషయంపై రాజంపేట, మదనపల్లె ప్రాంతాల కొంతమంది సోషల్ మీడియాలో చేస్తున్న అవమానకర వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన శ్రీకాంత్ రెడ్డి, తాము ఎక్కడికీ అన్యాయం చేసే ఉద్దేశ్యం లేదని స్పష్టం చేశారు.ఎన్నికైన ప్రజాప్రతినిధులుగా తమ ప్రాంత అభివృద్ధికి కృషి చేయడం తమ బాధ్యత మాత్రమేనని, ఏ ప్రాంతాన్ని తగ్గించాలన్న భావన తమలో లేదని తెలిపారు. రాయచోటిని కేంద్రంగా అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని, ఇందుకోసం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుగా అర్ధం చేసుకోవొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.