భూపాలపల్లి: జంగేడు లోని ప్రధాన రహదారిపై హల్చల్ సృష్టించిన భారీ అనకొండ, భయాందోళనకు గురైన వాహనదారులు
జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని జంగేడు వెళ్లే రహదారి కే టికెట్ మూలమలుపు వద్ద భారీ అనకొండ హల్చల్ సృష్టించింది ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో రోడ్డు దాటుతుండగా వాహనదారులు చూసి ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. భారీ ఆకారంలో ఉన్న ఆ అనకొండ అత్యంత ప్రమాదకరమని భావించిన వారు పాములు పట్టే వ్యక్తికి సమాచారం అందించడంతో సదరు వ్యక్తి అక్కడికి చేరుకొని దాన్ని బంధించి తీసుకెళ్లారు.