పాణ్యం మండలంలోని ఎస్.కొత్తూరు గ్రామంలో శైవ పుణ్యక్షేత్రం లో భద్రపాద మాస ఏకాదశి సందర్భంగా, ప్రత్యేక పూజలు
Panyam, Nandyal | Sep 17, 2025 పాణ్యం మండలంలోని ఎస్.కొత్తూరు గ్రామంలో శైవ పుణ్యక్షేత్రం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో భాద్రపద మాస ఏకాదశి వేడుకలు బుధవారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ ఈవో రామకృష్ణ, అర్చకులు సురేశ్, నారాయణస్వామి ఆధ్వర్యంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పంచామృతాభిషేకం, కుంకుమార్చన, మహా మంగళహారతి జరిగాయి. భక్తులు దర్శించుకుకోగా, అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు.