రాజపేట: దూది వెంకటాపురం గ్రామంలో పల్లెనిద్ర కార్యక్రమాన్ని నిర్వహించిన జిల్లా కలెక్టర్ హనుమంతరావు, సమస్యల పరిష్కారానికి హామీ
యాదాద్రి భువనగిరి జిల్లా, రాజాపేట మండల పరిధిలోని దూది వెంకటాపురం గ్రామంలో బుధవారం రాత్రి జిల్లా కలెక్టర్. గ్రామపంచాయతీ కార్యాలయంలో గ్రామస్తులతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ, హౌసింగ్, సివిల్ సప్లై, వైద్య, గ్రామీణ అభివృద్ధి, అటవీ, శిశు సంక్షేమ, విద్యుత్, రోడ్లు, పంచాయతీ, వ్యవసాయం వంటి వివిధ శాఖల అధికారులు ఈ పల్లెనిద్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. కలెక్టర్ హనుమంతరావు ప్రజా సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు.