కడప జిల్లా బద్వేల్ పట్టణంలోని నెల్లూరు రోడ్ లో గల డా.బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద బుధవారం రాజ్యాంగ దినోత్సవం పురస్కరించుకొని ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధా,వైసిపి నాయకులు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధా మాట్లాడుతూ అన్ని దేశాలలో కెల్ల మన భారత రాజ్యాంగం అతి పెద్ద రాజ్యాంగం అన్నారు.ఈ రోజు దేశం లోని ప్రతి వ్యవస్థ మన రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటూ ఒక బలమైన వ్యవస్థ గా తయారు అయిందని తెలిపారు.రాజ్యాంగం పట్ల ప్రతి ఒక్కరూ గౌరవం కలిగి రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలని సూచించారు.