పోచంపల్లి: మండల కేంద్రంలో విషాదం, మహిళ ఇంట్లో ఫ్యానుకు ఉరివేసుకొని మృతి
యాదాద్రి భువనగిరి జిల్లా, భూదాన్ పోచంపల్లి మండల కేంద్రంలో విషాద ఘటన చోటుచేసుకుంది. మంగళవారం సాయంత్రం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భూదాన్ పోచంపల్లి మండల కేంద్రానికి చెందిన రామసాని అక్షయ (35) అనే మహిళ ఇంట్లో సీలింగ్ ఫ్యాన్ కు చునితో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. సోమవారం రాత్రి జ్వరంతో ఉద్యోగానికి వెళ్ళని అక్షయ, మంగళవారం ఉదయం భర్త బజారుకు వెళ్లిన సమయంలో ఈ దారుణానికి ఒడిగట్టింది. భర్త తిరిగి వచ్చి చూసే సమయానికి అప్పటికే అక్షయ మృతి చెందింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు.