యర్రగొండపాలెం: త్రిపురాంతకం టిడిపి నాయకుల సమావేశంలో పాల్గొన్న టిడిపి ఇన్చార్జి ఎరిక్షన్ బాబు
ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలోని టిడిపి కార్యాలయం నందు త్రిపురాంతకం మండల నాయకుల కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో టిడిపి ఇన్చార్జి ఎరిక్షన్ బాబు మాట్లాడుతూ మండల అనుబంధ కమిటీలు మండల కమిటీ అధ్యక్షులను ఎన్నుకోవడం జరిగిందన్నారు. ప్రతిపాదించిన పేర్లను పార్టీ కార్యాలయానికి పంపిస్తామన్నారు. పార్టీ నిర్ణయము మేరకే పదవులను ప్రకటిస్తామని పేర్కొన్నారు.