కళ్యాణదుర్గం: గోళ్ల గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పునీత్ రాజ్ (6) అనంతపురంలో చికిత్స పొందుతూ మృతి
కళ్యాణదుర్గం మండలం గోళ్ల గ్రామ సమీపంలో శనివారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గోళ్ల గ్రామానికి చెందిన వన్నూరు స్వామి తన కుమారుడు పునీత్ రాజ్ (6)తో కలిసి బైక్ లో వెళ్తుండగా కారు ఢీకొన్న విషయం తెలిసిందే. తీవ్రంగా గాయపడిన తండ్రీ కొడుకు లను అనంతపురం ఆస్పత్రికి తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ పునీత్ రాజ్ మృతి చెందాడు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.