ద్వారకాతిరుమల పాయింట్ భీమడోలు రైల్వేస్టేషన్ లో ఎక్స్ ప్రెస్ రైళ్లు ఆపాలని ఏలూరు ఎంపీ పుట్టాకు ఎమ్మెల్యే ధర్మరాజు ఫోన్
Eluru Urban, Eluru | Sep 30, 2025
ఏలూరు జిల్లాలోని ద్వారకాతిరుమల పాయింట్ భీమడోలు రైల్వేస్టేషన్ లో ఎక్స్ ప్రెస్ రైళ్లు నిలుపుదల చేసి, స్టేషన్ అభివృద్ధి చెయ్యాలని ఉంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ ను కోరారు. మంగళవారం MLA ధర్మరాజు ఫోన్ ద్వారా ఎంపీకి భీమడోలు రైల్వేస్టేషన్ సమస్యలను వివరించారు. చినవెంకన్న భక్తులు, ముప్పై గ్రామాల ప్రజల సౌకర్యార్థం కనీసం 3 ఎక్స్ ప్రెస్ రైళ్లు నిలుపుదల చెయ్యాలని, స్టేషన్ ను అభివృద్ధి చెయ్యాలని కోరగా ఎంపీ సానుకూలంగా స్పందించారు. గతంలో కూడా ఈస్టేషన్ లో రైళ్లు నిలుపుదలకు, స్టేషన్ అభివృద్ధికి రైల్వే మంత్రి కి, అధికారులను కోరినట్లు ఎంపీ తెలిపారని MLA పేర్కొన్నారు.