కొండపి: రాష్ట్రంలో చెడు పాలనను ప్రారదోలం: ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి
రాష్ట్రంలో చెడు పాలనను అంతమొందించి సుపరి పాలనను కూటమి ప్రభుత్వం అందిస్తుందని మంత్రి స్వామి సోమవారం అన్నారు. చరిత్రలో హిందూ సాంప్రదాయ ప్రకారం చెడుని పారద్రోలి మంచిని ఆస్వాదించే విధంగా హిందువులు ఆచరించాలన్నారు. రాష్ట్రంలో ప్రజలందరూ సంతోషంగా ఉండే విధంగా ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. రాష్ట్ర ప్రజలకు మంత్రి స్వామి దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. టంగుటూరు మంత్రి క్యాంపు కార్యాలయంలో సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు మీడియాతో మంత్రి స్వామి మాట్లాడారు.