పూతలపట్టు: దివ్యాంగుల కలల సాధనకై కూటమి ప్రభుత్వ కృషి చేస్తుంది ఎమ్మెల్యే మురళీమోహన్
తవణంపల్లె ప్రాథమికోన్నత పాఠశాలలో సమగ్ర శిక్ష సహిత విద్యా విభాగం ఆధ్వర్యంలో మెడికల్ అసెస్మెంట్ క్యాంప్ శనివారం ఉదయం నిర్వహించారు. పూతలపట్టు నియోజకవర్గంలోని ఐదు మండలాలకు చెందిన ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శిబిరాన్ని సందర్శించిన పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ కలికిరి మురళీమోహన్ మాట్లాడుతూ, దివ్యాంగ విద్యార్థుల కలలు నిజం కావడానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని, వారికి మెరుగైన వైద్య సౌకర్యాలు, సమాన అవకాశాలు కల్పించడంలో ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, వైద్యులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు