నంద్యాల డిప్యూటీ విద్యాశాఖ అధికారి కార్యాలయంలో చోరీకి పాల్పడిన దొంగలు అరెస్ట్: ఎస్పీ మంద జావలి
Nandyal Urban, Nandyal | Sep 15, 2025
నంద్యాల డిప్యూటీ విద్యాశాఖ అధికారి కార్యాలయం పక్కనే ఉన్న గదిలో భారీ దొంగతనం జరిగింది. 90 ట్యాబులు, 60 అడాప్టర్లు, 150 ఓటీజీ కేబుళ్లు, ఇతర సామగ్రి చోరీకి గురైంది. పట్టణానికి చెందిన షేక్ హుస్సేన్ వలి, మరో మైనర్ బాలుడు ఈ దొంగతనం చేసినట్లు గుర్తించి సోమవారం అరెస్ట్ చేశామని నంద్యాల జిల్లా ఏఎస్పీ మందా జావళి వెల్లడించారు. నిందితుల నుంచి రూ.6.93 లక్షల విలువైన సామగ్రి స్వాధీనం చేసుకున్నామన్నారు.