కళ్యాణదుర్గం: కళ్యాణదుర్గం లోకేష్ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించిన ఎంపీలు, ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్, ఎస్పీ లు
కళ్యాణదుర్గంలో ఈనెల 8న భక్త కనకదాస జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహిస్తుండడంతో ముఖ్యఅతిథిగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ హాజరు కానున్న విషయం తెలిసిందే. అనంతపురం, హిందూపురం ఎంపీలు అంబికా లక్ష్మీనారాయణ, పార్థసారథి, ఎమ్మెల్యే సురేంద్రబాబు, జిల్లా కలెక్టర్ ఆనంద్, జిల్లా ఎస్పీ జగదీష్ తదితరులు మంగళవారం లోకేష్ పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. భక్త కనకదాస విగ్రహ ఆవిష్కరణ ప్రాంతాన్ని కూడా పరిశీలించారు. ఏర్పాట్లను పక్కాగా చేయాలని స్థానిక అధికారులను వారు ఆదేశించారు.