అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు పోలీస్ స్టేషన్ ఆవరణలో ఆటో డ్రైవర్లు వివిధ రకాల వాహనాలు నడిపే డ్రైవర్లతో పోలీస్ అధికారులు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. దీనికి సంబంధించిన వివరాలను సోమవారం మధ్యాహ్నం రెండు గంటలకు సీఐ గోపాలకృష్ణ, ఎస్సై రమేష్ తెలిపారు. చింతూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఆటో డ్రైవర్లు వివిధ వాహనాలు నడిపే డ్రైవర్లతో సమావేశం నిర్వహించి, గంజాయి వ్యాపారాలు సహకరిస్తే కేసుల్లో ఇరుక్కుంటారని తద్వారా ఇబ్బందులు పడతారని హెచ్చరించినట్లు చెప్పారు. గంజాయి కి సంబంధించిన వారు ఎవరైనా ఉంటే వారి సమాచారం ఇవ్వాలని సూచించినట్లు చెప్పారు.