సిరిసిల్ల: ముస్తాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన కాంగ్రెస్ మండల అధ్యక్షులు బాల్‌రెడ్డి
ముస్తాబాద్ మండలంలోని రామ్‌రెడ్డిపల్లె, పోతుగల్, తెర్లుమద్ది గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు జడ్పీటీసీ గుండం నర్సయ్యతో కలిసి ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏళ్ల బాల్‌రెడ్డి భూమి పూజలు, శంకుస్థాపనలు చేశారు. స్పెషల్ డెవలప్‌మెంట్ నిధులతో రామ్‌రెడ్డిపల్లెలో రూ.5 లక్షల వ్యయంతో పాఠశాల వంట గదితో పాటు ప్రహరీ, పోతుగల్‌లో పెద్దమ్మల కాలనీలో రూ.5 లక్షలతో సీసీ రోడ్డు, మరో రూ.5 లక్షలతో జిమ్, హైమాస్ట్ లైట్ల ఏర్పాటుకు పనులు ప్రారంభించారు.