శ్రీకాకుళం గ్రామంలోని కృష్ణానది రేవు వద్ద భారీగా చేరిన వరద నీరు
Machilipatnam South, Krishna | Sep 24, 2025
ఘంటసాల మండల పరిధిలోని శ్రీకాకుళం గ్రామంలోని కృష్ణానది రేవు వద్ద భారీగా నీరు చేరింది.ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రకాశం బ్యారేజీ నుంచి బుధవారం 4.16 లక్షల క్యూసెక్కుల వరద నీటిని విడుదల చేశారు. దీనితో శ్రీకాకుళం గ్రామంలోని కృష్ణానది రేవు వద్ద భారీగా నీరు చేరింది. అధికారులు అప్రమత్తమై నదిలోకి ఎవరూ వెళ్లకుండా చర్యలు చేపట్టారు. నదీ పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు.