జమ్మలమడుగు: పిట్టిగుంట : గ్రామంలో నీట మునిగిన మినుము పంట ...ప్రభుత్వం ఆదుకోవాలని రైతు ఆవేదన
కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం పరిధిలోని కాశినాయన మండలం పిట్టిగుంట గ్రామానికి చెందిన రైతు మల్లేశ్వర్ రెడ్డికి చెందిన 7.50 ఎకరాల మినుము పంట వర్షానికి నీట మునిగిందని బుధవారం రైతు మల్లేశ్వర రెడ్డి ఆవేదన వ్యక్తం చేశాడు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంట చేతికి వచ్చే సమయంలో నీళ్లపాలు కావడంతో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. లక్షల్లో పెట్టుబడులు పెట్టామని పూర్తిస్థాయిలో నీటిపాలు కావడంతో ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని వారు కోరారు.