ప్రకాశం జిల్లా లో నవంబర్ 4వ తేదీ మంగళవారం ఉరుములు మెరుపులతో పాటు ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు సోమవారం తెలిపారు. వర్షం కురుస్తున్న సమయంలో పిడుగులు పడే అవకాశం కూడా ఉందని ఈ నేపథ్యంలో ప్రజలు చెట్ల కింద ఉండవద్దని అలా ఉండడం వల్ల ప్రాణానికే అపాయం జరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు ప్రజలను హెచ్చరిస్తున్నారు.