అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నం మండలం ఎస్ రామన్నపాలెం గ్రామంలో గ్యాస్ బండ పేలడంతో అగ్నిప్రమాదం జరిగింది. మంగళవారం రాత్రి 8:30 గంటలకు అప్పయ్యమ్మనే మహిళ వంట చేస్తుండగా గ్యాస్ బండ నుంచి గ్యాస్ లీకేజ్ అవ్వడం జరిగిందని స్థానికులు చెప్పారు. మహిళ వెంటనే భయపడి బయటికి పరుగులు తీయడం జరిగిందని, మంటలు గ్యాస్ బండకు అంటుకోవడంతో పేలిపోయినట్లు చెప్పారు. అప్పయ్యమ్మ ఇంటితోపాటు ప్రక్కనే ఉన్న మరొక ఇల్లు పూర్తిగా కాలిపోయిందని తెలిపారు. ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదని, ఆస్తి నష్టం జరిగినట్లు చెప్పారు.