తాడేపల్లిగూడెం: సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన తాడేపల్లిగూడెం ఆర్డీవో కే. చెన్నయ్య
తాడేపల్లిగూడెం ఆర్డీవో కే. చెన్నయ్య సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఎన్నికల నోటిఫికేషన్ గురువారం మధ్యాహ్నం 3 గంటలకు జారీ చేశారు. తన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. 18 నుంచి 25వ తేదీ వరకు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. 26న స్క్రూట్నీ, 29వ తేదీ వరకు ఉపసంహరణకు అవకాశం ఉన్నట్లు ఆర్డీవో చెన్నయ్య వివరించారు.