నాయుడుపేటలో వర్షం పడితే ఈ రహదారిపై ప్రయాణం నరకప్రాయమే
తిరుపతి జిల్లా నాయుడుపేటలో గత నాలుగు రోజుల నుండి భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో పట్టణంలోని గాంధీ మందరం నుంచి పిచ్చిరెడ్డి తోపు వెళ్లే రహదారి గుంతల మయంగా తయారై అత్యంత ప్రమాదకరంగా ఉందని స్థానికులు వాహనదారులు వాపోయారు. ఈ దారిలో వెళ్లాలంటే నరకయాతన అనుభవించాల్సి వస్తుందని తెలిపారు. గతంలో గ్రావెల్ తోలినప్పటికీ ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు ఈ రహదారి గుంతల మయంగా మారిందన్నారు. దీంతో ఈ మార్గం మీదుగా వెళ్లాలంటే వాహనాలు మరమ్మత్తులు గురవడంతోపాటు ఒళ్ళు హూనమవుతుందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం ఈ మార్గం మీదుగా వెళుతూ బైకిస్ట్ ప్రమాదవశాత్తు గోతిలో పడి గాయాలపాలు అయినట్లు వారు