పులివెందుల: పులివెందులలో బాలికల కళాశాలల్లో ఉర్దూ మీడియం ప్రవేశంపై ఎమ్మెల్సీకి వినతిపత్రం అందజేసిన అధ్యాపకులు
Pulivendla, YSR | Sep 16, 2025 పులివెందులలోని బాలికల జూనియర్ కళాశాల మరియు మహిళా డిగ్రీ కళాశాలల అధ్యాపకులు, ఆయా విద్యాసంస్థల్లో ఉర్దూ మీడియంను ప్రవేశపెట్టాలని కోరుతూ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి కి వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ ప్రాంతంలోని విద్యార్థినుల భాషా అవసరాలను దృష్టిలో ఉంచుకొని, ఉర్దూ మీడియంను ప్రారంభించడం వల్ల అనేకమంది విద్యార్థినులు ఉన్నత విద్యను సులభంగా కొనసాగించవచ్చని అధ్యాపకులు ఆయనకు వివరించారు. వినతిపత్రాన్ని స్వీకరించిన అనంతరం ఎమ్మెల్సీ రామగోపాల్ రెడ్డి సానుకూలంగా స్పందించారు.