నగరంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల దిష్టిబొమ్మ దగ్ధం చేసిన కాంగ్రెస్ పార్టీ నేత BVRK చౌదరి
Eluru, Eluru | Apr 2, 2024 దెందులూరు అసెంబ్లీ సీటు ఆశించి భంగపడ్డ బివిఆర్.కే చౌదరి, అతని వర్గీయులు మంగళవారం సాయంత్రం ఏలూరు వసంత్ మహల్ సెంటర్లో నిరసన చేపట్టారు. ఈ నిరసనలో భాగంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిళ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా దెందులూరు కాంగ్రెస్ పార్టీ నేతబివిఆర్.కే చౌదరిమాట్లాడుతు పార్టీ కోసం కష్టపడ్డ తనకు కాకుండా మరొకరికి దెందులూరు టికెట్ కేటాయింపు పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను కాంగ్రెస్ పార్టీ కి గుడ్ బై చెప్పనున్నట్లు బి.వి.ఆర్.కే చౌదరి వెల్లడించారు