మచిలీపట్నం: మచిలీపట్నం సర్వజన ప్రభుత్వాస్పత్రి ICU విభాగం పనితీరుపై సీనియర్ సివిల్ జడ్జి రామకృష్ణయ్య ఆగ్రహం
కృష్ణాజిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జ్ కె.వి రామకృష్ణయ్య శనివారం మధ్యాహ్నం 12గంటల సమయంలో మచిలీపట్నం సర్వజన ప్రభుత్వాస్పత్రిలో ఆకస్మిక తనిఖీలు చేశారు. సాధారణ వ్యక్తిగా ఆస్పత్రికి వచ్చిన ఆయన వివిధ విభాగాలను సందర్శించి ప్రజలకు అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. ఐసీయూ విభాగంలో ఏసీలు పనిచేయక దుర్గంధం వెదజల్లుతున్న విషయాన్ని స్వయంగా పరిశీలించిన ఆయన సంబంధిత విభాగ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.