రేగోడు: రేగోడు లో మాజీ సర్పంచ్, నాయకులను ముందస్తుగా అదుపులోకి తీసుకున్న పోలీసులు
Regode, Medak | Feb 4, 2025 మెదక్ జిల్లా రేగోడు మండల కేంద్రంలో మాజీ సర్పంచ్, నాయకులను మంగళవారం మధ్యాహ్నం రెండువేల సమయంలో పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు. సర్పంచుల పెండింగ్ బిల్లులను అడిగితే అక్రమంగా అరెస్టు చేస్తారా అంటూ మాజీ సర్పంచ్ల ఫోరం మెదక్ జిల్లా ఉపాధ్యక్షుడు సుంకం రమేష్ అన్నారు. తాము పదవి కాలంలో ఉన్న సమయంలో చేసిన పనులకు బిల్లులు చెల్లించాలని డిమాండ్ చెప్పారు. గత ప్రభుత్వం పెండింగ్ బిల్లులను చెల్లిస్తామని చెప్పి దాటవేశారని ఆరోపిస్తూ ఈసారి బిల్లులు చెల్లించకపోతే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్కు గుణపాఠం చెబుతామంటూ హెచ్చరించారు.