వేమన విగ్రహ ఏర్పాటుకు స్థలం కేటాయించాలని మంత్రి సవితాను కోరిన రెడ్డి సంఘం నాయకులు
శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలానికి చెందిన రెడ్డి సంఘం నాయకులు ఆదివారం మధ్యాహ్నం మంత్రి సవితను పెనుకొండలోని తన క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. వారు గోరంట్ల మండల కేంద్రంలో వేమన విగ్రహ ఏర్పాటుకు స్థలం కేటాయించాలని మంత్రికి వినతి పత్రం అందజేశారు. మంత్రి సవిత సానుకూలంగా స్పందించి, త్వరలోనే పరిష్కారం చూపుతామని తెలియజేశారన్నారు.