సంగారెడ్డి: దివ్యాంగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సదాశివపేటలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో దివ్యాంగుల ధర్నా
దివ్యాంగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సుదాశివపేట తహసిల్దార్ కార్యాలయం ముందు ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. దివ్యాంగుల పింఛన్ 6 వేలకు పెంచాలని ఎమ్మార్పీఎస్ నాయకులు డిమాండ్ చేశారు.