నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం ప్రమాద వశాత్తు పశువుల కోసం నిల్వ చేసుకున్న గడ్డివాము దగ్ధమైన ఘటన మంగళవారం సాయంత్రం మండల కేంద్రంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెలితే కొత్తపల్లి మండల కేంద్రంలోని బీసీ కాలనీకి చెందిన రైతు బోయ సాయన్న చిన్న కొడుకు రాముడు రెండు బండ్ల గడ్డిని పశువుల మేతకు ఇతర రైతును నంచి రూ.10000 వేలకు కొనుగోలు చేశాడు,దాన్ని సాయంత్రం తన ఇంటి సమీపంలోని ఖాళీ స్థలంలో వేసుకున్నాడు,అయితే సాయంత్రం సమయంలో ఉన్నట్టుంది మంటలు చెలరేగాయి. దీంతో గమనించిన చుట్టుప్రక్కల వాళ్లు బిందెలతో నీళ్లు చల్లి మంటలను అదుపులోకి తెచ్చారు,అప్పటికే పశుగ్రాసం మొత్తం మంటల్లో కాలిపోయింది.