అసిఫాబాద్: ఐటీడీఏ పీవో కుష్బూ గుప్తా గోండు సామాజిక వర్గంపై కక్ష సాధింపు చర్యలు మానుకోవాలి:
తుడుందెబ్బ
గోండు సామాజిక వర్గంపై కక్ష సాధింపు చర్యలు ఐటీడీఏ పీవో మానుకోవాలని తుడుందెబ్బ జిల్లా ప్రధాన కార్యదర్శి వెడ్మ భగవంతరావు అన్నారు. గురువారం తిర్యాణిలో తుడుదెబ్బ నాయకులు నిరసన తెలుపుతూ మాట్లాడారు..ఆశ్రమ పాఠశాలలో పని చేస్తున్న 220 మంది తాత్కాలిక ఆదివాసి కార్మికులను తొలగించడం హేమమైన చర్య అని మండిపడ్డారు. గత కొన్ని సంవత్సరాలుగా కార్మికులు పనిచేస్తున్న వారికి జీతాలు సరైన సమయంలో రాకపోవడం వల్లనే కార్మికులు రోడ్డుకేక్కారని పేర్కొన్నారు. సమ్మె చేస్తున్న సమయంలో కార్మికులపై సస్పెన్షన్ వేటు వేసి వారిని శాశ్వతంగా విధుల నుంచి తొలగించడం అన్యాయం అన్నారు.