అహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి,సినీ నటుడు డాక్టర్ రాజేంద్రప్రసాద్ ప్రత్యేక పూజలు
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండల పరిధిలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన దిగువ అహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సినీ నటుడు డాక్టర్ రాజేంద్రప్రసాద్ సోమవారం మధ్యాహ్నం దర్శించుకున్నారు. అర్చకులు ప్రత్యేక పూజలు చేయించి, తీర్థప్రసాదాలు అందజేశారు. ఆయనతో సెల్ఫీలు దిగడానికి ప్రజలు పోటీ పడ్డారు.