పులివెందుల: పోలీస్ వ్యవస్థపై విద్యార్థినిలకు అవగాహన కల్పించిన, వేంపల్లె సీఐ నరసింహులు
Pulivendla, YSR | Oct 26, 2025 పోలీస్ వ్యవస్థపై విద్యార్థినిలకు అవగాహన కల్పించినట్లు వేంపల్లె సిఐ టి.నరసింహులు అన్నారు. ఆదివారం స్థానిక పోలీస్ స్టేషన్ నందు వివిధ అంశాలను వివరించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ విధ్యార్థి దశలోనే పోలీస్ వ్యవస్థపై అవగాహన ఏర్పరచుకోవడం అవసరమన్నారు. పోలిసు అమర వీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా పోలిసు వ్యవస్థ పనితీరు, ప్రజలకు అందిస్తున్న సేవలు, వివిధ విభాగాలపై అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు.