గూడరేవుపల్లి గ్రామంలో తల్లులకు, గర్భవతులకు నిమోనియా వ్యాధి పై అవగాహన కల్పించిన డాక్టర్ ఉషశ్రీ
పిల్లలకు జ్వరం,వేగంగా శ్వాసతీసుకోడం లేదా శ్వాస తీసుకోవడములో ఇబ్బంది, ఆకలి లేకపోవడం మొదలగు లక్షణాలు బహుశా న్యుమోనియా వ్యాధి కావచ్చునని నిర్లక్ష్యం చేయక వైద్య నిపుణులను సంప్రదించాలని జిల్లా వ్యాధి నిరోధక టీకాలు నిర్వహణ అధికారి డా:ఉషశ్రీ తల్లులకు మరియు గర్భిణీ స్త్రీలకు సూచనలిచ్చారు. బుధవారం ప్రపంచ న్యుమోనియా దినోత్సవం సందర్భంగా పీలేరు మండలం గూడరేవుపల్లె లోని తల్లులతో సమావేశం నిర్వహించి "బాల్యానికి - న్యుమోనియా వద్దు" అంశముపై డా:ఉషశ్రీ అవగాహన మరియు తల్లుల సహకారంతో ర్యాలీ నిర్వహించారు.