హిమాయత్ నగర్: హైదరాబాద్ నగరాన్ని పట్టించుకునే ఒక మంత్రి లేరు ఒక ఎమ్మెల్యే లేరు: మాజీ మంత్రి కేటీఆర్
తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ నాయకులతో మాజీ మంత్రి కేటీఆర్ సోమవారం మధ్యాహ్నం సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ హైదరాబాదులో నిన్న ముగ్గురు యువకులు వర్షాలలో గల్లంతయిన ఘటనపై స్పందించారు. నగరాన్ని పట్టించుకునే ఒక మంత్రి లేరు ఒక ఎమ్మెల్యే లేరని అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం ముగ్గురు మంత్రులను పెట్టిన వరదల కోసం ఒక మంత్రిని కూడా పెట్టలేదని అన్నారు.