గ్యారంపల్లి గురుకుల జూనియర్ కళాశాలలో తాత్కాలిక అతిధి అధ్యాపక పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం
అన్నమయ్య జిల్లా కంభం వారి పల్లి మండలం గ్యారంపల్లి లోని ఆంధ్రప్రదేశ్ గురుకుల జూనియర్ కళాశాలలో ఖాలీగా ఉన్న కెమిస్ట్రీ, కామర్స్ సబ్జెక్టులకు అతిథి అధ్యాపక పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ జె.శ్రీనివాస గుప్త బుధవారం తెలిపారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ లో కెమిస్ట్రీ,కామర్స్ నందు 50% పైగా అర్హత కలిగిన అభ్యర్థుల నుండి తాత్కాలిక ప్రాతిపదికన ఒక ఏడాదికి దరఖాస్తులు కోరుతున్నట్లు తెలిపారు.నెలకు 18 వేల రూపాయలు వేతనము ఇవ్వబడునని,అప్లికేషన్ మరియు సర్టిఫికెట్స్ జిరాక్సులను ఎపిఆర్జేసి గ్యారంపల్లి94@జిమెయిల్ డాట్ కామ్ కు ఈ నెల 11వ తేదీ సాయంత్రం లోపు మెయిల్ చేయాలన్నారు.