తాడేపల్లిగూడెం: స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన తాడేపల్లిగూడెం మాజీచైర్మన్ దేవతి పద్మావతి.
2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి తాడేపల్లిగూడెం మాజీ మున్సిపల్ చైర్మన్ దేవతి పద్మావతి స్వతంత్ర అభ్యర్థిగా శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు తాడేపల్లిగూడెం ఆర్డీవో కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. 1995 లో తాడేపల్లిగూడెం మున్సిపాలిటీకి చైర్మన్ గా పనిచేశారు. ఈ సారి ఎన్నికల్లో స్వాతంత్ర్య అభ్యర్థిగా పద్మావతి ఎన్నికల బరిలో నిలుస్తున్నారు.