తాడిపత్రిలో మంగళవారం హిందూ సంఘాలు, హిందూ ధార్మిక సంస్థల ప్రతినిధుల ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని పురవీధుల గుండా, ప్రధాన రహదారుల గుండా బైక్ ర్యాలీ కొనసాగింది. జైశ్రీరామ్ అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈనెల 27న తాడిపత్రిలో హిందూ సమ్మేళన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తామని హిందూ సంఘాల నాయకులు వెల్లడించారు.