కళ్యాణదుర్గం: పేద పిల్లలకు వైద్య విద్యను దూరం చేసే కుట్రకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది: అనుంపల్లిలో మాజీ ఎంపీ తలారి రంగయ్య
పేద, మధ్య తరగతి పిల్లలకు వైద్య విద్యను దూరం చేసే కుట్రకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని మాజీ ఎంపీ తలారి రంగయ్య ఆరోపించారు. సెట్టూరు మండలం అనుంపల్లి గ్రామంలో బుధవారం కోటి సంతకాల ప్రజా ఉద్యమం కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా రంగయ్య మాట్లాడారు. రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలన్నింటినీ ప్రైవేటుపరం చేయడానికి సీఎం చంద్రబాబు సన్నాహాలు చేస్తున్నారన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటుపరం కానీయమన్నారు. ఎంతవరకైనా పోరాటం చేస్తామన్నారు.