మేడ్చల్: మేడ్చల్ లో మద్యం మత్తులో తండ్రిని హత్య చేసిన కుమారుడు
మద్యం మత్తులో కుమారుడు తండ్రిని హత్య చేసిన ఘటన మేడ్చల్లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సిద్దిపేట జిల్లా ములుగు మండలం అచయిపల్లికి చెందిన నిజాముద్దీన్ ను తన కొడుకు సాతక్ హత్య చేశాడు. మద్యం మత్తులో వారిద్దరి మధ్య గొడవ జరగగా సాతక్ తుర్కపల్లి వాటర్ ప్లాంట్ వద్ద బండరాయితో కొట్టి నిజాముద్దీన్ చంపేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి సాతక్ తో పాటు అతడు స్నేహితుడు రాజును అరెస్టు చేశారు.