మార్కాపురం: సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో పాల్గొన్న సబ్ కలెక్టర్ ఎస్వి త్రివినాగ్, ఎమ్మెల్యే కందుల
ప్రకాశం జిల్లా మార్కాపురం డివిజన్ విద్యుత్ శాఖ కార్యాలయంలో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సబ్ కలెక్టర్ ఎస్వి త్రివినాగ్, ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ... పునరుత్పాదక శక్తి పరికరాలపై జీఎస్టీ తగ్గింపు ప్రయోజనాలను వివరించారు. ప్రతి ఒక్కరు పీఎం సూర్య ఘర్ సోలార్ అమర్చుకోవాలని సూచించారు. విద్యుత్ శాఖ సిబ్బంది కృషి చేయాలని పేర్కొన్నారు